పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరు కాబడి బుగ్గారం మండలం యశ్వంత రావు పేట గ్రామంలో రూ. 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అంగన్వాడిల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు యూనిఫాంలను పంపిణీ చేశారు.