బోయినిపల్లి మండలంలో పలు పాఠశాలలు గురువారం ఆకస్మిక తనిఖీ చేసిన మండల విద్యాధికారి శ్రావణ్ కుమార్. పాఠశాల విద్యార్థుల సంఖ్య అడ్మిషన్ రిజిస్టర్, యూడైస్ ఆన్లైన్లో సమానమైన సంఖ్య ఉండాలని, తేడా ఉంటే క్లస్టర్ సీఆర్పీల ద్వారా సమస్య క్లియర్ చేసుకోవాలని తెలిపారు. దేశాయిపల్లి పాఠశాలలో టీచర్ విమల తరగతి బోధనను పరిశీలించి అభినందించారు, మధ్యాహ్న భోజనం మెనూప్రకారం జరిగేలా చూడాలన్నారు. వీరితో సత్యనారాయణ సీసీవో ఉన్నారు.