సిద్ధిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి శివారులోని ఓ పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్, మద్దూరు పోలీసులు శనివారం దాడి చేశారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి రూ. 2, 040 నగదు, నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ షేక్ మహబుబ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా పేకాట అడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.