సిద్దిపేట జిల్లాలో రోజు రోజుకు ఎస్సీ, ఎస్టీల పై అత్యాచారాలు పెరుగుతున్నందున ఎస్సీ, ఎస్టీ పిఓఏ చట్టం ప్రకారం అట్రాసిటి లు జరిగే ప్రాంతంగా గుర్తించి నివారణకు చర్యలు తీసుకొవాలని మంగళవారం గజ్వేల్ లో ఒక ప్రకటనలో డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళితుల ఆర్తనాదాలతో జిల్లా తెల్లారుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి ఏగొండ స్వామి, తదితరులు పాల్గొన్నారు.