గజ్వేల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏఈ మారుతి తెలిపారు. పట్టణంలోని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధనలక్ష్మీ కాలనీ, బీడీ కాలనీ, హౌసింగ్ బోర్డు, ఆఫీసర్స్ కాలనీ, లక్ష్మీప్రసన్న కాలనీ, కోర్టు ఏరియా, రాజిరెడ్డిపల్లి, వాసవీనగర్, ప్రభుత్వాస్పత్రి ఏరియా, సిరి ఎన్ క్లేవ్, బాలాజీ ఎన్ క్లేవ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని తెలిపారు.