గజ్వేల్ పట్టణమిలోని ఎడ్యుకేషన్ హబ్, గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పబ్లిక్ ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో పార్క్ ప్రదేశాలలో పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం షీటీమ్ నెంబర్, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్, డయల్ 100, నెంబర్లను వాల్ పెయింటింగ్ వేయడం జరిగిందని గజ్వేల్ షీటీమ్ ఏఎస్ఐ శ్రీరాములు శనివారం తెలిపారు. ప్రజలు అత్యవసర, ఆపద సమయంలో పోలీసుల సేవలు వినియోగించుకోవాలని కోరారు.