తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్ధిక మరియు కుల గణాంకాల సర్వేపై సూపర్వైజర్లతో సిద్ధిపేట గజ్వేల్-ప్రజ్ఞాపుర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య రివ్యూ సమావేశం శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా ప్రతి ఇంటిని కవర్ చేయాలని అన్నారు. అలాగే ప్రజలు సర్వేకు వచ్చినటువంటి ఎన్యుమరేటర్లకు సహకరించాలని తెలియజేశారు.