సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి, కొండపాక మండలం గుద్దల గ్రామానికి చెందిన పల్లె అమూల్య శ్రీకి బ్లడ్ క్యాన్సర్ అని తెలుసుకొని వారి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం 20000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా దుద్దడ గ్రామ సర్పంచ్ ఆరేపల్లి మహదేవ్, అంజిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.