ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వే వివరాలను జాగ్రత్తగా పొందుపర్చాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హామీద్ అన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఐఓసీ కార్యాలయంలో కులగణన సర్వే వివరాలను పొందుపర్చడంపై డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర కులగణన ఎంత ముఖ్యమో వివరాలు ఎంట్రీ చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు.