బీహార్‌లోని చాప్రా పట్టణానికి సమీపంలోని గోల్డింగ్ గంజ్ రైల్వేస్టేషన్‌లో బాలిక మృతదేహం లభ్యమైంది. ఓ ట్రాలీ బ్యాగులో బాలిక మృతదేహం బయటపడడం కలకలం రేపింది. పలువురు ప్రయాణికులు రైల్వే బ్రిడ్జి కింద ఓ పెద్ద ఎర్రటి ట్రాలీ బ్యాగును గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తెరచి చూడగా అందులో బాలిక మృతదేహం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.