మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఓ కారు అతి వేగంగా వస్తూ ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఎగిరిపడ్డారు. ప్రమాదంలో ఓ యువకుడు లారీ కింద పడబోయి త్రుటిలో తప్పించుకుంటాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.