బీటిల్ జాతికి చెందిన కెన్యా లెస్సర్ మీల్ వార్మ్ అనే కీటకం రీసైకిల్ చేయడం వీలు కాని పాలీస్టైరిన్ వంటి ప్లాస్టిక్‌ను కూడా తినగలుగుతోంది. ఈ విషయాన్ని కెన్యాలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఇన్‌సెక్ట్ ఫిజియాలజీ అండ్ ఎకాలజీ సైంటిస్టులు కనుగొన్నారు. పాలీస్టెరిన్, ఊక కలిపిన మిశ్రమాన్ని వారంలో 11.7 శాతం తింటున్నట్లు గుర్తించారు. వీటి వల్ల భూమిపై పొంచి ఉన్న ప్లాస్టిక్ ముప్పును అరికట్టవచ్చునని వారు భావిస్తున్నారు.