ఝరాసంగం: రేపు మంత్రి కొండా సురేఖ పర్యటన
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ ఈనెల 15వ తేదీన ఝరాసంగంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు కేతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.