హత్నూర మండలంలోని బోరపట్ల గ్రామ శివారులోని రామదూత కాటన్ మిల్ పరిశ్రమలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జోగిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్, సీసీఐ ఇన్ఛార్జ్ శక్తివెల్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పత్తిని విక్రయించాలని చెప్పారు. దళారులను ఆశ్రయించవద్దని పేర్కొన్నారు.