సిర్గాపూర్: కాంగ్రెస్ రైతుల పక్షపాతి ప్రభుత్వం: ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సిర్గాపూర్ మండలం పోచాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ వెంకట రాములు, ఐకెపి సీసీ హనుమాన్లు, ఏఈఓ సమత పాల్గొన్నారు.