గత 2రోజులుగా కురుస్తున్న వర్షానికి సోమవారం జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని డ్రీమ్ వ్యాలీ కాలనీలోని ఇండ్ల మధ్యలో భారీగా వర్షం నీరు చేరింది. కాలనీ పక్కనుండి వరద నీరు వెళ్లే కాలువ 3, 4 చోట్ల గండిపడి వరద నీరు కాలనీలోకి వచ్చి చేరింది. ఇండ్లలో ఉన్నవారు బయటికి రాకుండా రహదారుల మీద వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో మున్సిపల్ అధికారులు, మాజీ కౌన్సిలర్ నామారవికిరణ్ సహాయక చర్యలు చేపట్టారు.