సంగారెడ్డి: ఉద్యోగులకు పీఆర్సి వెంటనే ప్రకటించాలి

57பார்த்தது
సంగారెడ్డి: ఉద్యోగులకు పీఆర్సి వెంటనే ప్రకటించాలి
ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సిని వెంటనే ప్రకటించాలని ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇతర అధికారుల మాదిరిగానే ఎంఈవోలకు కూడా వాహనం కేటాయించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி