బీజేపీ మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించుదామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు యూసుఫ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. సంగారెడ్డిలోని కేబుల్ కిషన్ భవన్‌లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా సదస్సు ఆదివారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మతోన్మాద విద్వేష శక్తుల నుంచి తెలంగాణను రక్షించుకుందామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శిలు జలాలుద్దీన్, జయరాజు పాల్గొన్నారు.