విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేద్దామని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సాయి బాషా అన్నారు. హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఉపకార వేతనాలు ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.