సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్బిఐ రీజినల్ మేనేజర్ ప్రకాష్ రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం సమీపంలోని పార్కులో ఆదివారం ఉదయం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మీ సెల్ ఫోన్ కు వచ్చే ఓటిపి నెంబర్లు ఎవరికి చెప్పవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ గిరి కుమార్, మేనేజర్లు పద్మజ, రమేష్ పాల్గొన్నారు.