సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి నీలం మధు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కార్యకర్తలు అంతా సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లేలా పనిచేయాలని కోరారు.