సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ అరుణ మాట్లాడుతూ.. లగిచర్ల గ్రామం నా పార్లమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ లగిచర్ల ను సందర్శించేందుకు నన్ను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు రైతులను భయబ్రాంతులకు గురిచేసి భూములు గుంజుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పటన్ చెరు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.