మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కుల్చారం మండల కేంద్రానికి చెందిన పోచయ్యకి మంజూరైన 26 వేల 5వందల రూపాయల చెక్కును, అదే గ్రామానికి చెందిన రామకృష్ణకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 12వేల రూపాయల చెక్కును, కరంట్ రాజా గౌడ్ కి ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ పట్టణ మున్సిపల్ వైస్ ఛైర్మెన్ నయీం ఉద్దీన్, సీనియర్ నాయకులు సత్యం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.