జిల్లాలో ఏర్పాటు చేసే టపాకాయల దుకాణాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్పి రూపేష్ ఓ ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక దుకాణాలకు డివిజన్ పోలీసు అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ జనాభాసలకు దూరంగా టపాకాల దుకాణాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే 1884 యాక్ట్ ప్రకారం కఠించర్లు తీసుకుంటామని హెచ్చరించారు.