18 ఏళ్ళ వయసు నుండి 70 ఏళ్లు వయసు మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ భూమయ్య అన్నారు. శుక్రవారం ఉదయం నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష భీమ యోజన ప్రతి ఏటా బ్యాంకులో రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.