అందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో మహాత్మా బసవేశ్వర 891 జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త అని వందల సంవత్సరాల క్రితమే కుల మతాలకు అతీతంగా పోరాడి అతని ఆధ్వర్యంలోనే మార్పు తెచ్చిన గొప్ప గురువని గ్రామ పెద్దలు కొనియాడారు. అతని ప్రవచనాలు ప్రపంచ వ్యాప్తంగా ఆచరించడం జరుగుతుందని, అందుకే విశ్వ గురువు అయ్యాడని వక్తలు అభిప్రాయ పడ్డారు.