అందోల్ మండలం నేరడిగుంట శివారులోని ఎల్లమ్మగడ్డ దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోవడంతో భారీగా నీరు వచ్చి పంటపొలాలోకి వచ్చి చేరడంతో రైతులు దుక్కి దున్ని పంటలు వేసుకోవాలి అంటే నీరు ఉండటంతో వర్షాకాలం పంట నష్టపోతామని దిగులుపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్ లైన్ బాగుచేసి ఆదుకోవాలని రైతు నాయకుడు మిద్దెల శ్రీదర్ రెడ్డి అధికారులను డిమాండ్ చేస్తున్నారు.