అందోల్ మండలం నేరడిగుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సుమారు వెయ్యి మంది విద్యార్థులకు నోట్ బుక్స్, ప్యాడ్స్ సంశుద్ది స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ వారు మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంశుద్ది పౌండర్ సాయికిరణ్ యాదవ్, ఎంపీటీసీ లవ్వ కృష్ణగౌడ్, వీరేశం, శ్రీదర్ రెడ్డి, పాటశాల ప్రధానోపాధ్యాయులు సర్పరాజ్ అలీ, పారిజాతం, విద్యార్థులు పాల్గొన్నారు.