రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కలెక్టర్ వల్లూరు క్రాంతి చెప్పారు. ఆందోలు మండలం ఠాకూర్ నాదులపల్లి గ్రామాల్లో వరి కోతలను మంగళవారం పరిశీలించారు. వరి పంట దిగుబడి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, అధికారులు పాల్గొన్నారు.