కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలు అన్నీ కోల్పోయారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కురుమూర్తిస్వామి మీద ఒట్టుపెట్టి రేవంత్ మాట తప్పారని చెప్పారు. 'ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని మాట తప్పారు. రేవంత్ 45 నిమిషాల ప్రసంగంలో 55 సార్లు కేసీఆర్‌నే తలుచుకున్నారు. కేసీఆర్ అంటే రేవంత్‌కు భయం పట్టుకుంది. మాట తప్పడం, మోసం, అబద్ధాలు రేవంత్‌రెడ్డి డీఎన్ఏలోనే ఉంది' అని విమర్శించారు.