నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం పరిశ్రమకు ఇచ్చిన అనుమతిపై పునరాలోచన చేస్తామని తెలిపింది. అవసరమైతే పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని సర్కార్ యోచిస్తోన్నట్లు సమాచారం. కాగా, ఆ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.