ప్రభుత్వ నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని ప్రాణాల మీదికి తెచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. 'మార్చి నుంచి నవంబర్ వరకు లక్ష్మీ భవానీ కీర్తి అనే విద్యార్థిని 15 సార్లు ఎలుకలు కొరికితే అధికారులు ఏం చేసున్నట్లు? ఇది అత్యంత అమానవీయ ఘటన. ఎలుకలు కొరికిన ఇతర విద్యార్థుల ఆరోగ్యాలు సంరక్షించాలని, మంచి వైద్యం అందించాలి' అని డిమాండ్ చేశారు.