
రంగారెడ్డి: శివపార్వతుల కల్యాణ మహోత్సవం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫరూక్ నగర్ మండలం చించోడు గ్రామంలోని శివాలయంలో బుధవారం శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే దేవాలయం ప్రాంగణంలో బీఆర్ఎస్ నాయకుడు భీమారం వీరేషం గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ యువ నాయకుడు వై. రవీందర్ యాదవ్ ప్రారంభించారు. అంతకు మునుపు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను పొందారు.