అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాద్ నగర్ మున్సిపాలిటీ 15 వార్డుకు చెందిన చంద్రకళ రూ. 1, 00, 000 సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్‌ఓసీ మంజూరు అయ్యింది. మంగళవారం చంద్రకళ కి చెక్కును షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అందించారు. ఈ కార్యక్రమంలో రవితేజ, మహమ్మద్, సాయి కుమార్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.