బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం అన్ని జిల్లాలలో దీక్షా దివస్ కు సంబంధించి సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగానే వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా నియమితులైన పాలమూర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు మరియు కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన నాయకులకు కార్యకర్తలకు దీక్ష దివస్ కు సంబంధించి పలు ముందస్తు సూచనలు చేసారు.