గత 16 రోజులుగా షాద్నగర్ నియోజకవర్గం స్థానిక యువ నేత నదారం అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. 76 క్రికెట్ జట్లు ఈ పోటీలో తలపడ్డాయి. సోమవారం ఇందులో చివరగా షాద్ నగర్ గల్లీ టీం విజేతగా నిలిచి 50వేల నగదును అందుకోగా రన్నర్ గ షాద్ నగర్ రాయల్స్ టీం 30 వేల నగదును దక్కించుకుంది. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి బహుమతులు ప్రధానం చేశారు.