యాదవుల ప్రత్యేక ఉత్సవమైన "యాదవ సదర్ సమ్మేళనం" పండగ వేడుకలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు షాద్ నగర్ నియోజకవర్గ యాదవ సంఘం పెద్దలు, నాయకులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం యాదవ సంఘం పెద్దలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వై. యాదయ్య యాదవ్, గున్న భీమయ్య యాదవ్, సింగిల్ విండో చైర్మన్ దారమోని బక్కన్న యాదవ్, జంగ నర్సింలు యాదవ్ ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి చర్చించారు.