రంగారెడ్డి జిల్లా కేశంపెట్ మండలంలో ఆదివారం ఉచిత చేప పిల్లలను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్, మండల అధ్యక్షుడు వీరేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వరప్ప, నేతలు శశివర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, గిరి యాదవ్, అనుసుజ, కొత్తపేట ఉస్మాన్, అందే మోహన్, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.