సింగూరు ప్రాజెక్టు వద్ద పైప్ లైన్ పగిలిపోవడంతో నీటి సరఫరాను నిలిపేసి మరమ్మతులు చేపట్టామని మణికొండ జీఎం మహేందర్ నాయక్ మంగళవారం తెలిపారు. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలకు నీటి సరఫరాలో అంతరాయం కలిగిందని మరమ్మతులు పూర్తి కాగానే బుధవారం సాయంత్రం నుంచి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని, అప్పటి వరకు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు.