మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని బడంగ్ పేట్ లో ఆదివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కులగణన సమగ్ర సర్వేతో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉప కులాలకు సమ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.