కాలనీలలో సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి శుక్రవారం తెలిపారు. డివిజన్ పరిధిలోని ఎన్జిఓఎస్ కాలనీలలో రోడ్ల నిర్మాణానికి రూ. 78 లక్షలు మంజూరు చేయించినందకు కార్పొరేటర్ లచ్చిరెడ్డిని కలిసి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.