వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారుల నిర్మాణం, అంతర్గత రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అలాగే వనస్థలిపురంలో శిథిలమైన హుడా ఓపెన్ ఆడిటోరియం స్థలంలో అన్ని హంగులతో మినీ రవీంద్రభారతిని నిర్మించాలని వినతిలో కోరారు.