చంపాపేట డివిజన్ లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని స్థానిక కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి సూచించారు. డివిజన్ పరిధిలోని యాదగిరినగర్, పద్మానగర్ కాలనీల్లో రూ. 55 లక్షల నిధులతో ప్రారంభించిన సీసీ రోడ్డు పనులను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో స్థానికులు భాగస్వాములైతే త్వరిత గతిన పూర్తవుతాయన్నారు.