జూబ్లీహిల్స్ : లంచం తీసుకుంటూ దొరికిన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్
జూబ్లీహిల్స్ కు చెందిన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ జి. గణేశ్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కాఫీ షాప్‌కి జరిమానా వేయకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కాఫీ షాప్ యజమాని బుధవారం ఏసీబీ అధికారులను సంప్రదించగా. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ. 60, 000 లంచం డిమాండ్ చేసి, రూ. 25, 000 తీసుకుంటుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.