హైకోర్టు తీర్పుకు అనుగుణంగా డేడికేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.