తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ ఈనెల 5న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి
కేటీఆర్ ను శనివారం ఆహ్వానించారు. తమతో కలిసి ఈ మహాధర్నాలో పాల్గొనాల్సిందిగా కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ఆటో డ్రైవర్లు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.