హైదరాబాద్ లో దీపావళి వేడుకల్లో అపశ్రుతి.. ఆస్పత్రికి క్యూ

82பார்த்தது
దీపావళి రోజు నగరంలోని పలువురి ఇంట్లో అపశ్రుతి సంఘటనలు వెలుగుచూశాయి. చిన్నారుల నుంచి మొదలుకొని పెద్దల వరకు టపాసులు పేల్చే క్రమంలో కంటికి గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో బాధితులు మెహదీపట్నంలోని సరోజినీ దేవి ఆస్పత్రికి క్యూ కట్టారు. బాధితులకు చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. ఆనందంగా గడిపే సమయంలో పిల్లలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోయారు.