నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. బుధవారం కంటోన్మెంట్ పరిధి 6వ వార్డు హర్షవర్ధన్ కాలనీవాసులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. స్థానికంగా డ్రైనేజీ, వాటర్ లైన్, రోడ్లు సరిగా లేకపోవడం వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.