ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగర కలాన్ (5వ వార్డు)లో 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు, 10 లక్షల రూపాయల అండర్ డ్రైనేజీ పనులను శనివారం ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని దశలవారీగా ఆదిభట్ల మున్సిపాలిటీని అభివృద్ధి పరుస్తాన్నమని తెలిపారు.