చేవెళ్ల నియోజకవర్గం కొండకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఏ. విద్యాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో మంచి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య, కాశీనాథ్ గౌడ్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ లావణ్య శంకర్, పంచాయతీ సెక్రెటరీ ఎల్లయ్య, ఉపాధ్యాయులు రఘునందన్ రెడ్డి, రామకృష్ణారావు, యాదమ్మ, శ్రీనివాస్ రెడ్డి, కుసుమకుమారి, అంజిరెడ్డి, శ్రీనివాస్, జంగయ్య, రాములు, సుజాత, నారాయణ, సుదర్శన్ లు పాల్గొన్నారు.